ఏపీలోనూ భారీగా మద్యం అమ్మకాలు.. నిన్న ఒక్కరోజే కోట్లలో లిక్కర్ సేల్స్

by Ramesh Naini |

న్యూ ఇయర్ వేళ ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు భారీగా నమోదయ్యాయి.

ఏపీలోనూ భారీగా మద్యం అమ్మకాలు.. నిన్న ఒక్కరోజే కోట్లలో లిక్కర్ సేల్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: న్యూ ఇయర్ వేళ ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా హోటల్స్, పబ్బులు, రిసార్ట్స్‌ కేంద్రంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. నూతన సంవత్సర వేడుకలతో ప్రజలు పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేయడంతో ఒక్కరోజులోనే సుమారు రూ.200 కోట్ల మేర లిక్కర్ సేల్స్ జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాల సమాచారం.

ఈ సారి విక్రయాలు మరింత పెరిగాయి..

2024–25 ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు రూ.1700 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి విక్రయాలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ వేడుకలు ముగిసినప్పటికీ, సెలవుల ప్రభావంతో మరికొన్ని రోజులు అమ్మకాలు కొనసాగనున్నాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story