కోటప్ప కొండపై భారీ అగ్రి ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు

by Ramesh Goud |

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పవిత్ర పుణ్య క్షేత్రమైన కోటప్ప కొండ (Kotappa Konda) పైన భారీ అగ్రి ప్రమాదం (Fire Accident) సంభవించింది.

కోటప్ప కొండపై భారీ అగ్రి ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పవిత్ర పుణ్య క్షేత్రమైన కోటప్ప కొండ (Kotappa Konda) పైన భారీ అగ్రి ప్రమాదం (Fire Accident) సంభవించింది. దీంతో కొండ పైనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. త్రికోటేశ్వర స్వామి (Three Koteshwara Swamy) గిరి ప్రదక్షిణ రోడ్డు (Giri Pradhakshina Road) ముందు, వెనుక భాగంలో కొండపైన మంటలు దట్టంగా వ్యాపించాయి. కొండ చుట్టూ అడవి (Forest) ప్రాంతం కావడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో కొండపైన ఉన్న భక్తులు (Devotees) భయాందోళనకు గురవుతున్నారు. ఇది చూసిన స్థానికులు ఫైర్ సిబ్బందికి (Fire Department), పోలీసుల (Police) కు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది (Fire Dept Employees) సంఘటన స్థలానికి చేరుకుని, మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు వ్యాపించిన ప్రాంతాన్ని పరిలించిన పోలీసులు.. ఇది ఆకతాయిలు చేసిన పనా.. లేదా మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు (Enqueiry) చేస్తున్నారు. ఘటనపై కేసు (Case) నమోదు చేసి, విచారణ జరిపిస్తామని పోలీసులు వెల్లడించారు.

Next Story