- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక ఎమ్మెల్యే .. ఏడుగురు పీఏలు !
నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబుకు ఎంతమంది పీఏలు ఉన్నారు? వారు ఎవరు? ఏం పని చేస్తుంటారు? అన్న విషయాలపై టీడీపీ కేంద్ర కార్యాలయ ఇంటెలిజెన్స్ వర్గాలు కూపీ లాగుతున్నట్టు సమాచారం.

ఒక ఎమ్మెల్యే .. ఏడుగురు పీఏలు !
ఎమ్మెల్యే చెప్పారంటూ పైరవీలు
అధికారులకు అనధికార ఆదేశాలు
నగదు డిమాండ్.. బెదిరింపులు
టీడీపీ ఇంటిలెజెన్స్ నిఘాలో విస్తుపోయే నిజాలు
దిశ ప్రతినిధి, నరసరావుపేట : నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబుకు ఎంతమంది పీఏలు ఉన్నారు? వారు ఎవరు? ఏం పని చేస్తుంటారు? అన్న విషయాలపై టీడీపీ కేంద్ర కార్యాలయ ఇంటెలిజెన్స్ వర్గాలు కూపీ లాగుతున్నట్టు సమాచారం. ఆ క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగుచూసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబుకు అధికారిక పీఏ ఎవరో ఎవరికి తెలియదు. కానీ దాదాపు ఏడుగురు తాము ఎమ్మెల్యే అరవిందబాబు పీఏలమంటూ అధికారులకు కార్యాలయాలకు ఫోన్లు చేస్తుంటారు. ‘మీరు ఎప్పుడూ కనపడలేదు’ అని వారు అడిగితే నేను ఎమ్మెల్యే కారు లోనే ఉంటానని ఒకరు, ఇంట్లో ఉంటానని ఇంకొకరు, వ్యక్తిగత విషయాలు చూస్తానని వేరొకరు, అధికారుల వ్యవహారాలు చూస్తుంటానని మరొకరు ఇలా చెబుతూ ఉంటారు. ఇది గమనించిన పార్టీలోని కొందరు ఆ ఏడుగరి పేర్లు సేకరించి పార్టీ అధిష్టానానికి సమాచారాన్ని చేర్చినట్టు తెలుస్తోంది. ఈ ఏడుగురు పీఏలలో కొందరు కేవలం కలెక్షన్ల పనిలో ఉన్నారు. ఏ పార్టీ అన్న దానితో పనిలేదు.. పని గురించి డీల్ మాట్లాడుకోవడం, అధికారులను బెదిరిండటం, ఆ పని చేయించడం వంటివి చేస్తుంటారు. ముఖ్యంగా వైసీపీ వర్గాల ద్వారా వచ్చే ఆఫర్లన్నిటినీ సొమ్ము చేసుకుంటుూ ఉంటారు. ఇక ఉద్యగాలు ఇప్పిస్తామని, బదిలీల చేయిస్తామని చేసే మోసాలు చెప్పాల్సిన పనిలేదు.
పీఏల మోసాల చిట్టాలో మాయలెన్నో ..
- కొద్ది రోజుల క్రితం ఓ అధికారి పల్నాడు జిల్లా కు బదిలీ పై వచ్చారు. ఆయన వివరాలు తెలుసుకున్న ఏడుగురు పీఏలలో ఒకరు సదరు అధికారికి ఫోన్ చేసి తనకు ఖర్చుల కింద నెలకు రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అది విని ఆ అధికారికి మతి పోయినంత పని అయింది. తాను అలా ఇవ్వలేనని చెప్పటంతో కుదరదు ఇవ్వాల్సిందే అంటూ మరొక ముఖ్యుడు హంకరించినట్టు తెలిసింది. ఆ అధికారి ఏం చేయాల అని సతమత మౌతున్నారు.
- ఇంకొక పీఏ ఇటీవల కోటప్పకొండ ఈవోకు ఫోన్ చేసి ‘ఎమ్మెల్యే పీఏని మాటాడుతున్నా.. నేనొక యువకుడి పేరు చెబుతాను, అతనికి ఉద్యోగం ఇవ్వండి..’ అని ఆదేశించాడు. అయితే ఆ మాట్లాడిన వ్యక్తి మాటల్లో ఏదో తేడాను గమనించి ఈవో నేరుగా ఎమ్మెల్యేకే ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఎమ్మెల్యే స్పందిస్తూ.. తానెవరికి ఏ ఉద్యోగం ఇవ్వమని చెప్ప లేదని స్పష్టం చేశాడు.
- మూడు రోజుల క్రితం ములకలూరు లో వైన్స్ కు తాళం పడింది. పమిడిపాడు లో బెల్ట్ షాప్ లో మద్యం బాటిల్స్ పట్టుకున్నారు. ఇవి ములకలూరు షాప్ సరకు అని అభియోగాలు మోపే పరిస్థితి వచ్చింది. దీంతో ఆ షాప్ యజమాని తాము అక్రమ వ్యాపారం చేయమని కోపంతో షాపు కు తాళం వేసి ఎక్సైజ్ కార్యాలయంలో ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఖంగు తిన్న ఎక్సైజ్ సిబ్బంది, మీ సరకు కాదులే అని సర్దుకున్నారు. ఈ తతంగం అంతా ఎమ్మెల్యే పీఏ అని చెప్పుకొని తిరిగే మరొకరు చేసిన నిర్వాకం అని తర్వాత తెలిసింది.
ఇలా ఈ విధంగా ఎమ్మెల్యే అరవింద బాబు పీఏల కథలు విని ఇటు అధికార వర్గాలతో పాటు , పార్టీ శ్రేణులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. అస్సల ఒక ఎమ్మెల్యేకి ఎంత మంది పీఏలు ఉంటారు? అన్న ప్రశ్న ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కూడా ఇంతమంది పీఏలు ఉండరేమోనన్న చర్చ పట్టణంలో జోరుగా సాగుతోంది.
ఎంపీపై వ్యతిరేక వార్తలు..
నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీ కృష్ణ దేవరాయలుపై ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కోటరీలో ముఖ్యుడిగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి పదే పదే తాను పని చేస్తున్న ఛానెల్ ద్వారా వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తున్నాడు. అయితే ఇదంతా ఎమ్మెల్యే అరవింద బాబు అండ తోనే జరుగుతుందన్నది బహిరంగ రహస్యమే. అయితే ఆ ఛానల్ పాత్రికేయుడు ఏ వ్యాపారం చేయడు. కానీ పట్ణణంలో ఐదు అంతస్తుల భవనం నిర్మిస్తున్నట్టు తీవ్ర చర్చ సాగుతుంది. ఇది ఎలా సాధ్యమైందంటూ స్థానికులు నెవ్వర పోతున్నారు. అసలు విషయం ఏమిటంటే మున్సిపాలిటీ లో టౌన్ ప్లానింగ్ వ్యవహారాలు, ప్రభుత్వ ఆసుపత్రి వ్యవహారాలు సదుపు పాత్రికేయుడి కనుసన్నల్లో నడుస్తాయి. అయితే ఈ విషయం స్థానిక ఎంపీ, పార్టీ అధినేతకు సైతం తెలుసని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు ఏ చర్యలు లేవు. ప్రస్తుతం పార్టీ కేంద్ర కార్యాలయ ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ వ్యవహారాలన్నింటిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పల్నాడు పోలీస్ యంత్రాంగం అరవింద బాబు పీఏల వ్యవహారంతో పాటు ఇతర అంశాలను సేకరించి అధిష్టానం ఆదేశాల కోసం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవరాలపై చర్యలు తప్పేలా లేవు అని ఆ ఇంటెలిజెన్స్ బృందంలోని ఓ అధికారి చెప్పడం విశేషం.






