Tirumala News:శ్రీవారి సర్వదర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

by Jakkula.Mamatha |

తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

Tirumala News:శ్రీవారి సర్వదర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల చేరుకుని.. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొన్ని సార్లు సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో నేడు(ఆదివారం) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 90,051 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.2.90 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు.

Next Story