చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో తెలుసా? వేదిక ఫొటోలు వైరల్

by Anjali |
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో తెలుసా? వేదిక ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ముఖ్యమంత్రిగా రేపు (జూన్ 12) టీడీపీ అధినేత రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కోట్లాది మంది టీడీపీ శ్రేణులు, అభిమానులు ఎదురుచూసిన ఈ ఘట్టం రానే వచ్చేసింది. ఇప్పటికే ఈ స్వీకరోత్సవానికి పలువురు ప్రముఖ నాయకులు, సెలబ్రిటీలు హాజరవ్వనున్నారని నెట్టింట వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వేడుకకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం రాబోతున్నారు. టాలీవుడ్ బడా హారోలు.. చిరంజీవి, రజనీకాంత్, రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా హాజరవ్వనున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా జనాలు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే ఈసారి బాబు ప్రమాణ స్వీకారోత్సవానికి కోట్లు ఖర్చు చేయబోతుందట ఏపీ ప్రభుత్వం. చరిత్రలో నిలిచిపోయోలా చాలా గ్రాండ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఫైనల్లీ బోయపాటి శ్రీను ప్లానింగ్ తో ఈ వేడుకను జరిపించబోతున్నారని సమాచారం. కాగా దీని కోసం ఏకంగా రూ. 10 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

Next Story

Most Viewed