Tirumala News:తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ

by Jakkula.Mamatha |

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

Tirumala News:తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. ఈ క్రమంలో గత వారం రోజుల నుంచి పోల్చితే తిరుమలలో శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. దీంతో ఇవాళ(సోమవారం) శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్ లో వేచి ఉన్నారు. నిన్న(ఆదివారం) శ్రీవారిని మంది 87,138 భక్తులు దర్శించుకున్నారు. 30,099 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.4.33 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.

Next Story