- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mark shankar:కోలుకుంటున్న పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే(ఫొటో)
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Deputy Cm pawan kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark shankar) ఇటీవల ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Deputy Cm pawan kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark shankar) ఇటీవల ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. సింగపూర్‌లో అతను చదువుతున్న పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. ఈ అగ్ని ప్రమాదంలో అతని చేతులు, కాళ్ళకు స్వల్ప గాయాలు కాగా.. పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో ఇబ్బంది ఎదుర్కొన్నారు.
ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తన కుమారుడిని చూడటం కోసం మంగళవారం సింగపూర్‌కు వెళ్లారు. పవన్ చిన్న కుమారుడు త్వరగా కోలుకోవాలని రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ఆకాంక్షించారు. అంతేకాదు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఇవాళ(బుధవారం) జనసేన నాయకులు విజయనగరం జిల్లాలోని శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఇదిలా ఉంటే.. అగ్ని ప్రమాదంలో గాయపడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్(7) కోలుకుంటున్నాడు. తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్ ఫొటో(Photo) బయటకు వచ్చింది. ఆ ఫొటోలో ‘నాకేం కాలేదు.. నేను ఆరోగ్యంగా ఉన్నాను’ అన్నట్లు చేతులతో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సైగ చేశాడు.






