- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Simhadri Appanna: సింహాద్రిలో ఆ దుర్ఘటన ఎలా జరిగింది.. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నది ఇదే..
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో (Chandanotsavam) అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఘటన ఎలా జరిగిందనే విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు, ఎన్టీఆర్ఎఫ్(NDRF) సిబ్బంది వివరించారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం.. ఈ ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి... మంగళవారం అర్ధరాత్రి 2.30 గంటల సమయం. ఆ సమయంలో ఆలయ అనువంశిక ధర్మకర్త అయిన అశోకగజపతిరాజు చందన సమర్పించారు. అదే టైంలో సింహగిరి బస్టాండ్ నుంచి పైవైపు వెళ్లే దారిలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ల కోసం భక్తులు వేచి ఉన్నారు. అంతకు ముందు దాదాపు అరగంట పాటు కుండపోతగా భారీ వర్షం కురిసింది. ఈ ప్రభావంతో కొండ అంతా జలమయం అయింది. అప్పుడే రూ.300 క్యూలైన్లో భక్తులు క్యూ కాంపెక్ల్స్లోకి వస్తున్నారు. ఆ సమయంలో మెట్ల మార్గంలో ఉన్న క్యూలైను పక్కనే గోడ ఒక్కసారిగా కూలింది.
భక్తులు వేచి ఉన్న ప్రదేశంలో కొత్తగా గోడను నిర్మించారు. ఆ సిమెంటు గోడకు టెంటుకు సంబంధించిన తాడును కట్టినట్లు భక్తులు చెబుతున్నారు. గాలివాన రావడంతో ఆ తాడు బలంగా గోడను లాగినట్లు భావిస్తున్నారు. భారీ వర్షానికి ఆ గోడ కూలి భక్తులపై పడింది. అప్పుడు పెద్ద శబ్దం వచ్చింది. దీంతో స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. ఆ గోడను ఈ మధ్యనే నిర్మించడంతో పచ్చిగా ఉన్నట్లు భావిస్తున్నారు. చందనోత్సవం కావడంతో ఎన్టీఆర్ఎఫ్సిబ్బంది, ఫైర్‌సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు. దీంతో వారు నిమిషాల వ్యవధిలో వచ్చి అక్కడ సహాయక చర్యలలో పాల్గొన్నారు. సమాచారం అందుకున్న హోమంత్రి అనిత (Home minister Anitha) హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కలెక్టర్ హరీంద్రప్రసాద్, ఎస్పీ శంఖబధ్ర బాగ్చిలు పర్యవేక్షించారు.






