AP Assembly: ఏపీలో అందరికీ ఇళ్లు.. ప్రభుత్వం ఇచ్చేది ఎంతంటే..

by Thanuru Gopichand |

రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇళ్ల పట్టాల కోసం 70, 232 దరఖాస్తులు వచ్చాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు

AP Assembly: ఏపీలో అందరికీ ఇళ్లు.. ప్రభుత్వం ఇచ్చేది ఎంతంటే..
X

దిశ, డైనమిక్ ​బ్యూరో : రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇళ్ల పట్టాల కోసం 70, 232 దరఖాస్తులు వచ్చాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ (anagani satyaprasad)​ వెల్లడించారు. రాష్ర్టంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై వైసీపీ ఎమ్మెల్సీలు రాజశేఖర్, హనుమంతురావు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన అనగాని బదులిచ్చారు. అందరికీ ఇళ్ల పథకం (housing) కింద గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలను అందజేస్తామన్నారు. గత ప్రభుత్వం సెంటు స్థలం మాత్రమే ఇవ్వగా మా ప్రభుత్వం రెండు, మూడు సెంట్ల స్థలం ఇస్తోందన్నారు. అంతేకాక ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయల (4 laks) ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. జగనన్న ఇళ్ల పథకం పెద్ద కుంభకోణంలా మారిందని ఆరోపించారు. లబ్దిదారుల ఎంపికలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని అన్నారు. ధనవంతులు, ఉద్యోగులు, పార్టీ కార్యకర్తలు, అనుయాయులకు ఇళ్ల పట్టాలు పంచి పెట్టారని తెలిపారు. ఇళ్ల పట్టాల కోసం భూముల కొనుగోలు లోనూ పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని అన్నారు. నివాసయోగ్యం కాని భూములను, శశ్మానాలు, డంపింగ్ యార్డులు పక్కనున్న భూములను, వర్షం వస్తే మునిగిపోయే భూములను రెండింతలు, మూడింతలు అధిక ధరలకు ప్రభుత్వంతో కొనిపించారు. మొత్తం 10,500 కోట్ల రూపాయలతో 26 వేల ఎకరాల ప్రయివేట్ భూములను కొనుగోలు చేశారని, ఇందులో నుండి వేల కోట్ల రూపాయలు వైసీపీ నేతలు, కార్యకర్తల జేబుల్లోకి వెళ్లాయని తెలిపారు. కానీ చంద్రబాబు (chandrababu)నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రం పేదలకు మేలు చేయాలనే లక్ష్యంతోనే అందరికీ ఇళ్ల పథకాన్ని చేపట్టిందన్నారు.

Next Story