- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారీ బీభత్సం.. నడిరోడ్డుపై ఘోరం
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బంటుమిల్లి మండలం పెద్దతుమ్మడి పరిధిలో వేగంగా దూసుకొచ్చిన లారీ బైక్‌ను బలంగా ఢీకొట్టింది..

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా(Krishna District)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. బంటుమిల్లి మండలం పెద్దతుమ్మడి పరిధిలో వేగంగా దూసుకొచ్చిన లారీ(Lorry) బైక్(Byke)ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. మృతులను చిన్నతుమ్మడి గ్రామానికి చెందిన వేముల శివయ్య (27), కాగిత అమలేశ్వరరావు (27)గా గుర్తించారు. వీరిద్దరూ తమ ద్విచక్ర వాహనంపై బంటుమిల్లి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పెద్దతుమ్మడి సమీపంలోని మురుగు కాలువ వంతెనను దాటిన తర్వాతి క్షణంలోనే, బంటుమిల్లి నుండి హనుమాన్ జంక్షన్ వైపు వెళ్తున్న లారీ వీరిని ఎదురుగా వచ్చి ఢీకొట్టింది.
బైకును ఈడ్చుకుంటూ...
ఢీకొట్టిన వేగానికి లారీ బైకును కొంతదూరం ఈడ్చుకుంటూ మురుగు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ తీవ్రమైన ప్రమాదంలో వేముల శివయ్య సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడు అమలేశ్వరరావును చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో మచిలీపట్నం ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే కన్నుమూశాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






