అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: కొండను ఢీకొట్టిన ఐచర్ వ్యాన్

by Vemula.Srinu Prasad |

అల్లూరి సీతారామరాజు జిల్లా బొంతువలస ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది..

అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: కొండను ఢీకొట్టిన ఐచర్ వ్యాన్
X

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా బొంతువలస ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతపల్లి జాతరకు వెళ్లి తిరిగి వస్తున్న ఒక ఐచర్ వ్యాన్, ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా అదుపు తప్పి వేగంగా కొండను ఢీకొట్టింది. ఈ సమయంలో వ్యాన్‌లో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాద ధాటికి వ్యాన్ ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. లోపల ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా హాహాకారాలు చేశారు.

ఈ ప్రమాదంలో పది మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లనో లేదా మలుపు వద్ద వేగం నియంత్రించలేకపోవడం వల్లనో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story