- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుంటూరులో ఘోరం.. మహిళను వివస్త్రను చేసి దాడి
గుంటూరులో కొంత మంది వ్యక్తులు ఓ మహిళను లక్ష్యంగా చేసుకొని దాడి చేసిన వీడియో సంచలనంగా మారింది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో షాకింగ్ సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కొంత మంది వ్యక్తులు ఓ మహిళను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిన వీడియో సంచలనంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టీడీపీ కార్యకర్త అయిన మల్లెల మూర్తికి బాధిత మహిలకు బోరు విషయంలో వాగ్వాదం జరిగింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న మూర్తి.. కొంతమంది మహిళలను, యువకులను పురమాయించారు. దీంతో వారు ఈ నెల 13న సదరు మహిళతో గొడవపడి దారుణంగా దాడి చేశారు.
నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే వివస్త్రను చేసి, పిడిగుద్దులతో దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఈ దాడితో షాక్ తిన్న సదరు మహిళ పోలీసుకు ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేసింది. కానీ ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అనంతరం కేసు నమోదు చేసుకొని మూర్తి సహా దాడి చేసిన అందరిని అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు మూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






