Honor Killing Attempt : కుప్పంలో పరువు హత్యాయత్నం

by Muthe.Rajitha |

ఏపీ(AP)లో మరో పరువు హత్యాయత్నం(Honor Killing Attempt) జరిగింది.

Honor Killing Attempt : కుప్పంలో పరువు హత్యాయత్నం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో మరో పరువు హత్యాయత్నం(Honor Killing Attempt) జరిగింది. కూతురు వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో తట్టుకోలేకపోయిన తండ్రి.. కూతురు, అల్లుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో భార్య భర్తలు తీవ్రంగా గాయపడి, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. చిత్తూరు(Chithuru) జిల్లా కుప్పం(Kuppam)లో వేర్వేరు కులాలకు చెందిన కౌసల్య, చంద్రశేఖర్ లు ప్రేమించుకున్నారు. ఈ విషయం కౌసల్య తల్లిదండ్రులకు తెలియడంతో వారి వివాహానికి ససేమీరా ఒప్పుకోలేదు. దీంతో వారు ఇరువురు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ప్రేమ వివాహం(Love Marraige) చేసుకున్నారు.

అయితే కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం సమాజంలో పరువు తక్కువగా భావించిన తండ్రి... ఇంటికి రావాలని పిలిచి, కూతురు అల్లునిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. వారి కేకలు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. రక్తపు మడుగులో పడి ఉన్న వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న కుప్పం పోలీసులు.. ప్రేమ వివాహమే ఈ దాడికి కారణమని ప్రాథమిక నివేదికలో తేల్చారు. ప్రస్తుతం వారి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలియజేశారు. నిందితులను త్వరలోనే పట్టుకొని, తగిన శిక్ష పడేలా చేస్తామని అన్నారు.

Next Story