Home Minister Anitha:విశాఖ ప్రేమోన్మాది ఘాతుకం పై హోంమంత్రి ఆగ్రహం.. కఠినంగా శిక్షించాలంటూ ఆదేశం

by Jakkula.Mamatha |

విశాఖలో ప్రేమోన్మాది ఘటన పై హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Anitha) స్పందించారు

Home Minister Anitha:విశాఖ ప్రేమోన్మాది ఘాతుకం పై హోంమంత్రి ఆగ్రహం.. కఠినంగా శిక్షించాలంటూ ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో ప్రేమోన్మాది ఘటన పై హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Anitha) స్పందించారు. ఈ క్రమంలో ప్రేమోన్మాది ఘాతుకం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం(Vishakapatnam)లో యువతిపై ప్రేమోన్మాది దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండటం పై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడిని అడ్డుకునే ప్రయత్నంలో నిందితుడి చేతిలో యువతి తల్లి నక్కా లక్ష్మి ప్రాణాలు కోల్పోవడం విచారకరం అన్నారు.

ఈ ఘటన పై విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీతో హెం మంత్రి అనిత ఫోన్‌లో మాట్లాడారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆ యువతికి మెరుగైన వైద్యం అందించాలని ఆమె సూచించారు. దాడికి పాల్పడిన నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) స్పందిస్తూ.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే.

Next Story