విషవాయువు బాధితులకు హోంమంత్రి పరామర్శ

by Thanuru Gopichand |

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని నక్కపల్లి హెటిరో డ్రగ్స్ కాంప్లెక్స్‌లో విషవాయువులు లీక్​ అయిన ఘటనలో విశాఖపట్నం కేర్ హస్పటల్ లో చికిత్స పొందుతున్న బాధితులను హోమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు.

విషవాయువు బాధితులకు హోంమంత్రి పరామర్శ
X

దిశ, డైనమిక్​బ్యూరో/ విశాఖపట్నం : అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని నక్కపల్లి హెటిరో డ్రగ్స్ కాంప్లెక్స్‌లో విషవాయువులు లీక్​ అయిన ఘటనలో విశాఖపట్నం కేర్ హస్పటల్ లో చికిత్స పొందుతున్న బాధితులను హోమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. బాధితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెటిరో పరిశ్రమలో సోడియం హైపో క్లోరైడ్ గ్యాస్ లీకైన ఘటనలో 12 మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. వీరిలో ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన విశాఖలోని కేర్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. బాధితులకు భవిష్యత్తులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చికిత్స అందించాలని సూచించారు. పరిశ్రమలలో భద్రత, పొల్యూషన్ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం అన్నారు. భద్రత విషయంలో హెటిరో పరిశ్రమలో సమావేశం నిర్వహిల్సి ఉందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడం వలన సమావేశం నిర్వహించలేకపోయామని తెలిపారు. త్వరలో పరిశ్రమలో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. పరిశ్రమల్లో భద్రత పై హై లెవల్ కమిటీ ఏర్పాటు చేస్తాం అని హోంమంత్రి తెలిపారు. ప్రమాదం జరిగిన తరువాత సహాయక చర్యలు వెంటనే చేపట్టే విధంగా పరిశ్రమలు సిద్ధంగా ఉండాలన్నారు. కేజీహెచ్ ఘటన లో రౌడీ షీటర్ ను అరెస్టు చేశామని తెలిపారు.ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కేజీహెచ్ ను త్వరలో సందర్శించి భద్రత పై సమీక్షిస్తామని తెలిఊపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో మరింత నిఘా పెంచేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు హోంమత్రి పేర్కొన్నారు.

Next Story