జగన్ డిమాండ్‌పై హోంమంత్రి అనిత ఫైర్.. ఎమ్మెల్యేగా హాజరుకావాలంటూ పిలుపు

by Vemula.Srinu Prasad |

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ చిన్నపిల్లాడిలా జగన్‌ మారాం చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు

జగన్ డిమాండ్‌పై హోంమంత్రి అనిత ఫైర్.. ఎమ్మెల్యేగా హాజరుకావాలంటూ పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ(Assembly)కి వస్తానంటూ చిన్నపిల్లాడిలా జగన్‌ మారాం చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) అన్నారు. జగన్‌కు ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావాలని అని పిలుపునిచ్చారు. వైసీపీ హయాంలో చంద్రబాబుకు అవమానం జరిగితే ఆయన ఒక్కరే వాకౌట్‌ చేశారన్నారు. లిక్కర్‌ స్కామ్‌పై నివేదిక వచ్చాక మాట్లాడతానని హోంమంత్రి అనిత తెలిపారు.

కాగా 2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకు పరిమితమైంది. దీంతో సంఖ్యపరంగా జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. కానీ ఆ పార్టీ నాయకులు మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష ఎందుకు ఇవ్వరంటూ జగన్ సైతం ప్రశ్నించారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ఈ నెలాఖరు వరకు కొనసాగనున్నాయి. జగన్ మాత్రం సమావేశాలకు హాజరుకావడంలేదు. దీంతో ఆయనపై విమర్శలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్‌కు ప్రతిపక్ష హోదాపై రాష్ట్ర హోంమంత్రి సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Next Story