- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బూటుకాలుతో తన్ని కేసులు పెట్టారు: హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) అన్నారు. మచిలీపట్నం కలెక్టరేట్(Machilipatnam Collectorate)లో అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఏపీ ప్రజలకు రాజధాని ఏర్పాటు కలను సాకారం చేస్తామని హామీ ఇచ్చారు. మూడు రాజధానుల పేరుతో గత ఐదేళ్లూ రాక్షస పాలన సాగిందని మండిపడ్డారు. అమరావతి రాజధాని కోసం మహిళా రైతులు అవమానాలు, బాధలు పడ్డారన్నారు. బూటుకాలుతో తన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గకుండా పోరాడి గెలిచారని గుర్తు చేశారు.
విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికీ స్వేచ్ఛలేకుండా ఇబ్బందులు పెట్టారని చెప్పారు. ప్రధాని మోడీ నేతృత్వంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమరావతి నిర్మాణం తిరిగి పురుడుపోసుకుంటోందన్నారు. ప్రతి వ్యక్తికి సొంతిళ్లు, ప్రతి పౌరుడికి రాజధాని భావోద్వేగంతో కూడుకున్నవని చెప్పారు. ప్రధాని మోదీ సభకు తరలివచ్చే ప్రజలకు ఇబ్బందులు రాకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.






