- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకటో తేదీనే పోలీసులకు జీతాలు: హోంమంత్రి అనిత
ఒకటో తేదీనే పోలీసులకు జీతాలు ఇస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. పోలీసుల సంక్షేమంపై అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ పోలీసులకు బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు అన్నీ సమకూరుస్తున్నామన్నారు...

దిశ, వెబ్ డెస్క్: ఒకటో తేదీనే పోలీసులకు జీతాలు ఇస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) తెలిపారు. పోలీసుల సంక్షేమం(Police Welfare)పై అసెంబ్లీ(Assembly)లో ఆమె మాట్లాడుతూ పోలీసులకు బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు అన్నీ సమకూరుస్తున్నామన్నారు. పోలీసుల సంక్షేమంపై ఆలోచించింది కూటమి ప్రభుత్వమేనని చెప్పారు. రాజకీయ కక్షలు అనే పదం ఎవరికి సరిపోతుందో ప్రతి ఒక్కరికీ తెలుసని వైసీపీ నేతలనుద్దేశించి ఆమె విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో పోలీసులకు జీతాలు కూడా సరిగా ఇవ్వని పరిస్థితి ఉండేదన్నారు. పోలీసులకు కులం, మతం, రాజకీయమేంటని ప్రశ్నించారు. యూనిఫాం వేసుకోగానే ఎవరితో సంబంధం లేదన్నారు. రాజకీయ కక్షతో ఉద్యోగాలు తీసేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో చూశామని విమర్శించారు. పోలీసులకు రాజకీయాలు ఆపాదంచడం సరి కాదన్నారు. కోర్టు కేసులు క్లియర్ చేసిన తర్వాతనే రిక్రూట్‌మెంట్ చేపట్టామని మంత్రి వంగలపూడి అనిత గుర్తు చేశారు.






