- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోంమంత్రి అనిత మరోసారి సీరియస్.. కఠిన చర్యలు తప్పవని వార్నింగ్
హోంమంత్రి వంగలపూడి అనిత మరోసారి సీరియస్ అయ్యారు...

దిశ, వెబ్ డెస్క్: హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Anitha) మరోసారి సీరియస్ అయ్యారు. మహిళల(Women)ను కించపరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళలను కించపరిస్తూ సాక్షి ఛానల్(Sakshi Channel) డిబేట్, వైసీపీ(Ycp) నేతల విమర్శలపై ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శక్తి మాప్... దిశ యాప్‌పై దుష్ప్రచారంపై ఆమె మండిపడ్డారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఓర్చుకోలేక వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy) డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి మహిళలను సాక్షి ఛానల్‌లో కించపరుస్తూ డిబేట్ నిర్వహిస్తే ఇప్పటి వరకూ ఎవరిపైనా జగన్ చర్యలు తీసుకోలేదన్నారు. సాటి మహిళలను అసభ్యకరంగా మాట్లాడితే వారిని వైసీపీలోని మహిళా నేతలు ఉండగా ఉంటారా అని ఆమె ప్రశ్నించారు. చివరికి తల్లికివందనంపై రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుటుంబంలో ఒక్కరికీ మాత్రమే కాదని, పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులందరికీ తల్లికి వందనం అందిస్తున్నామని, కానీ నిధులు దుర్వినియోగం చేస్తున్నామంటూ వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి అనిత మండిపడ్డారు. తల్లికి వందనం నిధులు విడుదలపై మంత్రి నారా లోకేశ్ సవాల్ చేస్తే వైసీపీలో ఇప్పటివరకూ స్పందించిన నాయకుడు లేరని ఎద్దేవా చేశారు. చివరకు తాము చెప్పిన శక్తి యాప్‌పైనా దుష్ప్రచారం చేస్తున్నారని వంగలపూడి అనిత మండిపడ్డారు. దిశ యాప్‌నే శక్తి యాప్‌గా మార్చారని విమర్శలు చేస్తున్నారని, ఆ రెండు యాప్‌లకు చాలా తేడా ఉందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని ఓర్వలేకనే శాంతిభద్రతలకు విఘాతం కలిస్తున్నారని, పోలీసులపై రాళ్లు రువ్వితే తమకూ బీపీలు వస్తాయి కథా అని హోంమంత్రి అనిత సెటైర్లు వేశారు.






