- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాళ్లను ఉపేక్షించొద్దు: కాకినాడ ఘటనపై హోంమంత్రి సీరియస్
కాకినాడ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు...

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ(Kakinada) ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) సీరియస్ అయ్యారు. రంగరాయ మెడికల్ కాలేజీ(Rangaraya Medical College) విద్యార్థులపై కొందరు సిబ్బంది లైంగికంగా వేధించడంపై ఆమె మండిపడ్డారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలపై లైంగిక వేధింపులను కారణమైన బాధ్యతులను అసలు ఉపేక్షించమని హెచ్చరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే బాధ్యుతలపై చర్యలు తీసుకున్నామని హోంమంత్రి అనితకు అనితకు అధికారులు వివరించారు. క్రిమినల్ కేసులు పెట్టినట్లు చెప్పారు.
కాగా కాలేజీ ల్యాబ్ సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని 50 మంది విద్యార్థినులు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అంతర్గత విచారణ జరిపించారు. ఇంతలో విషయం బయటకు పొక్కింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో బాధ్యులపై చర్యలు తీసుకున్నారు.






