Visakha: కూచిపూడిలో కూతురు మెరిసె.. తల్లి మురిసె

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-27 14:30:37  IST  )

తన కుమార్తె రేష్మిత ప్రతిభను చూసి తల్లి, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మురిసి పోయారు. ...

Visakha: కూచిపూడిలో కూతురు మెరిసె.. తల్లి మురిసె
X

దిశ, వెబ్ డెస్క్: తన కుమార్తె రేష్మిత(Reshmitha) ప్రతిభను చూసి తల్లి, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత(HomeMinister Vangalapudi Anitha) మురిసి పోయారు. విశాఖ కళాభారతి ఆడిటోరియంలో కూచిపూడి డ్యాన్స్(KuchipudiDance) & మ్యూజిక్ అకాడమీ 43వ వార్షికోత్సవ వేడుకల్లో రేష్మిత కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అంతేకాదు చిన్నా, పెద్దల నుంచి ప్రశంసలు అందుకున్నారు. దీంతో కూతురు ప్రదర్శనను చూసిన హోంమంత్రి అనిత అద్భుతమంటూ కితాబిచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఆమె అనుభూతిని పంచుకున్నారు.


‘‘ఈ క్షణం తల్లిగా నా మనస్సు ఉప్పొంగింది. నా కుమార్తె రేష్మిత కూచిపూడి నృత్యాభినయాన్ని వేదికపై ప్రదర్శిస్తున్నప్పుడు ప్రత్యక్ష్యంగా చూడడం నయనానందాన్ని కలిగించింది. పెద్దల ప్రశంసలు రావడం మధురానుభూతిని మిగిల్చింది. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, వీఎంఆర్ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్.. ఇతర ముఖ్యులతో కలిసి వార్షికోత్సవ వేడుకల్లో భాగస్వామ్యమై చిన్నారుల ప్రదర్శనను తిలకించడం మనసుకెంతో సంతృప్తినిచ్చింది.’’ అని వంగలపూడి అనిత పేర్కొన్నారు.


Click Here For Tweet..

Next Story