- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News:భూమన పై చట్టపరమైన చర్యలు.. హోంమంత్రి అనిత వెల్లడి
టీటీడీ గోశాలలో గోవులు చనిపోయాయన్న మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత ఫైర్ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: టీటీడీ గోశాలలో గోవులు చనిపోయాయన్న మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత ఫైర్ అయ్యారు. ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. భూమన అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి ప్రచారంతో టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో 260 మంది సిబ్బంది గో సంరక్షణ చేస్తున్నారని వివరించారు.
2,668 ఆవులకు జియో టాకింగ్ చేసి పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. కరుణాకర్ రెడ్డి టీటీడీ ఖజానాను దారి మళ్లించి కమిషన్లు కొట్టేసారని విమర్శలు గుప్పించారు. తిరుమల పై అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించింది భూమనే అని ఆరోపించారు. ఏడుకొండలు ఐదు కొండలుగా మార్చేందుకు భూమన కుట్ర చేశారని తెలిపారు. భూమన కరుణాకర్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిత వెల్లడించారు.






