- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిడ్డను ఎత్తుకుని రోడ్డుపై డ్యూటీ.. కానిస్టేబుల్‌ను ఇంటికి పిలిచి అభినందించిన హోంమంత్రి
ఇటీవల ఏపీలో జయశాంతి అనే కానిస్టేబుల్ రాత్రి సమయంలో బిడ్డను ఎత్తుకుని రోడ్డుపై ట్రాఫిక్ క్లియర్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో జయశాంతిపై ప్రశంసలు కురిశాయి.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల ఏపీలో జయశాంతి అనే కానిస్టేబుల్ రాత్రి సమయంలో బిడ్డను ఎత్తుకుని రోడ్డుపై ట్రాఫిక్ క్లియర్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో జయశాంతిపై ప్రశంసలు కురిశాయి. బిడ్డను పట్టుకుని రాత్రి సమయంలో డ్యూటీ చేయడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఆమెకు డ్యూటీపై ఉన్న డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పారు. అయితే ఈ వీడియో హోమంత్రి అనిత దృష్టికి వెళ్లడంతో ఇంటికి పిలిపించి జయశాంతిని అభినందించారు. కలిసి భోజనం చేస్తున్నంతసేపు ఇద్దరూ సరదాగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా తనను చాలా మంది ప్రశంసించారని కానీ ఇంటికి పిలిచి మీరు భోజనం పెట్టడం చాలా సంతోషంగా అనిపించిందని హోంమంత్రితో జయశాంతి అన్నారు. దీంతో మీరు చేసేదానికి ఇది చాలా తక్కువ అంటూ హోంమంత్రి అనిత సమాధానం ఇచ్చారు. కానిస్టేబుల్ తో పాటు ఆమె భర్త, పిల్లలు సైతం రాగా వారితోనూ హోమంత్రి మాట్లాడారు. పిల్లలతో సరదాగా మాట్లాడుతూ నీకు ఏ హీరో అంటే ఇష్టం అని అడగ్గా పవన్ కల్యాణ్ అంటే పిచ్చి అంటూ కానిస్టేబుల్ జయశాంతి చెప్పారు. సరదాగా సాగిన వీరి సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.






