Minister Anitha: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత

by Thanuru Gopichand |

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుండాలని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.

Minister Anitha: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత
X

దిశ, డైనమిక్​ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుండాలని హోంమంత్రి వంగలపూడి అనిత (Anitha) వెల్లడించారు.విజన్‌- 2047, పీ-4 విధానంతో బంగారు కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకురావాలన్నదే సీఎం లక్ష్యమని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారిని కుటుంబసమేతంగా ఆమె దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మంత్రి అనిత స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala) అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని హోంమంత్రి దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు బాగుండాలని ప్రార్థించినట్లు అనిత తెలిపారు. శ్రీరామనవమి నాడు శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో భాగ్యమని హోంమంత్రి అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి (Sri ramanavami) శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు శనివారం రాత్రి తిరుమలలోరి భూవరాహ స్వామి ఆలయాన్ని హోంమంత్రి అనిత దర్శించుకున్నారు.

Next Story