నిందితుడిని వదిలిపెట్టం.. మదనపల్లి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి

by Ajay Maddhiboyina |

ఏపీ హోంమంత్రి అనిత మదనపల్లి బాధితురాలి కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని, చట్టప్రకారం శిక్ష పడేలా చూస్తామని అన్నారు.

నిందితుడిని వదిలిపెట్టం.. మదనపల్లి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం నీరుగుట్టవారిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. రుషిక ప్రియ 7 అనే బాలిక అదృష్యం అవ్వ‌గా వారి ఇంటి ముందే నివాసం ఉండే కులవర్ధన్ అనే వ్యక్తి హతమార్చాడు. దారుణంగా హత్య చేయడమే కాకుండా బాలిక డెడ్ బాడీని ఇంట్లోని డ్రంబులో కుక్కేశాడు. బాలికపై అత్యాచారం కూడా జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితుడు గతంలోనూ పలువురితో అసభ్యంగా ప్రవర్తించినట్టు స్థానికులు చెబుతున్నారు.

ఇప్పటివరకు అతడు ఐదుగురిని చంపాడని ఆరోపిస్తున్నారు. బాలిక డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు తీసుకువెళ్లకుండా పోలీసులను అడ్డుకున్నారు. అతడిని నడిరోడ్డుపైనే చంపేసి, సరైన న్యాయం చేస్తామంటూ రోడ్డుపై ఆందోళనకు దిగారు. దీంతో మదనపల్లిలో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీ హోంమంత్రి అనిత బాధితురాలి కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని, చట్టప్రకారం శిక్ష పడేలా చూస్తామని అన్నారు. తక్షణమే అతడికి శిక్ష పడేలా చూస్తామని బెయిల్ రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారడంతో నిందితుడిని ఉరి తీయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Next Story