- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP Home Minister:మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత
ఏపీ(Andhra Pradesh) హోంమంత్రి అనిత మరోసారి మానవత్వం చాటుకున్నారు.

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) హోంమంత్రి అనిత మరోసారి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదం(Road Accident)లో గాయపడిన వారికి స్వయంగా సపర్యలు చేశారు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం(Visakhapatnam) తాడిచెట్లపాలెం జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగి అచేతన స్థితిలో పడిన ఓ యువకుడిని చూసి హోం మంత్రి అనిత(Home Minister Anitha) చలించిపోయారు. అటుగా ఎయిర్ పోర్ట్‌కు వెళుతున్న ఆమె ఘటనను చూసి తక్షణమే కాన్వాయ్‌ని ఆపి సహాయక చర్యలు చేపట్టారు. ఘటన స్థలానికి వెళ్లి గాయాలపాలైన ఓ వృద్ధురాలు సహా పలువురికి ఏం కాదమ్మా.. అంటూ ధైర్యం చెప్పి మెరుగైన వైద్యం అందించడం కోసం సమీప హాస్పిటల్‌కు తరలించాలని పోలీసులను ఆదేశించారు.
Next Story






