- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ పని మీరు చూసుకోండి..ప్రభుత్వ ఉద్యోగులపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వ ఉద్యోగులపై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరి ఉద్యోగం వాళ్లు, నీతిగా నిజాయితీగా రూల్స్‌కు అనుగుణంగా చేసుకోవాలని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగులపై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరి ఉద్యోగం వాళ్లు, నీతిగా నిజాయితీగా రూల్స్‌కు అనుగుణంగా చేసుకోవాలని అన్నారు. దానికి ఫ్రీడం ఉందని అన్నారు. అంతే కానీ ఎవరి తొత్తులుగా వ్యవహరించకూడదని వ్యాఖ్యానించారు. దానివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని, గత ప్రభుత్వంలో అదే జరిగిందన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వంలో అధికారులకు అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే అనుకుంటున్నామని తెలిపారు. పెద్దిరెడ్డి గన్ మెన్ సస్పెండ్ గురించి మాట్లాడుతూ హోంమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. గన్ మెన్‌ను ఇచ్చింది సెక్యురిటీ కోసమని అటెండర్ లా పనిచేయించుకోవడం కోసం కాదని అన్నారు. పెద్దిరెడ్డిపై ఎవరైనా ఎటాక్ చేసినప్పుడు గన్ మెన్ పక్కన లేకుండా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కావాలని తాము గన్ మెన్‌ను సస్పెండ్ చేయలేదని వ్యాఖ్యానించారు.






