- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాస్టర్ మృతిపై లోతైన విచారణ.. ప్రతి రోజూ ఆరా తీస్తున్న సీఎం చంద్రబాబు
by Vemula.Srinu Prasad |
పాస్టర్ పగడాల మృతిపై లోతైన విచారణ జరుపుతున్నామని, సీఎం చంద్రబాబు ప్రతి రోజూ ఆరా తీస్తున్నారని హోంమంత్రి అనిత తెలిపారు...

X
దిశ, వెబ్ డెస్క్: పాస్టర్ పగడాల మృతి కేసుపై ప్రతిరోజూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీస్తున్నారని మంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆమెను రాష్ట్ర పాస్టర్ల యూనియన్ నాయకులు కలిశారు. ప్రవీణ్ పగడాల కేసుపై చర్చించారు. ఈ సందర్బంగా హోంమంత్రి మాట్లాడుతూ పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారని తెలిపారు. పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారని చెప్పారు. ఈరోజో, రేపో డిటైల్ రిపోర్ట్ వస్తుందన్నారు. ప్రవీణ్ పగడాల అంటే తమకూ గౌరవమేనని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
‘‘ఈ కేసు విషయంలో కావాలనే కొంతమంది రాజకీయం చేస్తున్నారు. మత విద్వేషాలు రచ్చకొట్టడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెడతున్నారు. వారిపై దృష్టి సారించాం’’ అని హోంమంత్రి అనిత తెలిపారు.
Next Story






