- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చల్లపల్లి పీఎస్ వద్ద పేలుడు.. ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత
చల్లపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో పేలుడు ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ వద్ద సీజ్ చేసిన బాణసంచాను తరలిస్తుండగా సంభవించిన పేలుడులో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే స్పందించిన హోంమంత్రి అనిత.. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన విజయవాడ ఆసుపత్రికి తరలించాలని అధికారులను ఆదేశించారు. పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిన ఆమె.. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు రిపీట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశాలిచ్చారు.
ప్రమాదానికి కారణం!
గతంలో స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఒక షెడ్‌లో భద్రపరిచిన టపాసులను.. కోర్టు ఆదేశాల మేరకు నిర్వీర్యం చేసేందుకు పోలీసు వాహనంలో తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఈ ఘటనలో ఎస్ఐ దుర్గాంజనేయులు, కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా సహా ఐదుగురు సిబ్బందికి గాయాలు కాగా, వారిలో ముగ్గురి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ ప్రమాదంపై అంతర్గత విచారణకు ఎస్పీ ఆదేశించారు.






