వైఎస్ జగన్‌పై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

మాజీ సీఎం జగన్ పై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు...

వైఎస్ జగన్‌పై  హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy), వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి(YSRCP leader Nallapureddy Prasanna Kumar Reddy)తో పాటు వారి కుటుంబాలను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Former Chief Minister Jagan Mohan Reddy) పరామర్శించారు. నెల్లూరు జిల్లా(Nellore District)లో జరిగిన అక్రమాల వ్యవహారంలో కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ ద్వారా జగన్ కలిశారు. ధైర్యంగా ఉండాలని కాకాణికి జగన్ సూచించారు.

మరోవైపు కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదు అయింది. అయితే గురువారం మధ్యాహ్నం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు ఆయన కుటుంబాన్ని సైతం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. అటు జగన్ పర్యటనకు పరిమిత సంఖ్యలోనే జన సమీకరణకు పోలీసులు అనుమతించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం, పోలీసులపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

దీంతో వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై హోంమంత్రి అనిత(Home Minister Anita) స్పందించారు. జగన్‌పై విమర్శలు కురిపించారు. నేరాలు చేసి జైల్లో ఉన్న వారిని జగన్‌ కలుస్తున్నారు. ‘‘గంజాయిబ్యాచ్, క్రిమినల్స్‌కి జగన్ మద్దతిస్తున్నారు. మహిళలపై వైసీపీ నేతలు నీచంగా మాట్లాడుతున్నారు. గతంలో చంద్రబాబు భార్యపై అసభ్యంగా మాట్లాడారు.’’ అని హోంమంత్రి అనిత గుర్తు చేశారు.

Next Story