జగన్ తప్ప ఇంకెవరూ అతన్ని సమర్థించడం లేదు : హోంమంత్రి వంగలపూడి అనిత

by Naga Rani Yarlagadda |

యాభైవేల ఓట్ల మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి (MLA Prashanti Reddy) పై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని (Prasanna Kumar Reddy Comments) కోర్టులు కూడా తప్పు పట్టాయని,

జగన్ తప్ప ఇంకెవరూ అతన్ని సమర్థించడం లేదు : హోంమంత్రి వంగలపూడి అనిత
X

దిశ, వెబ్‌డెస్క్: యాభైవేల ఓట్ల మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి (MLA Prashanti Reddy) పై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని (Prasanna Kumar Reddy Comments) కోర్టులు కూడా తప్పు పట్టాయని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి అనిత వెల్లడించారు. ప్రసన్నకుమార్ రెడ్డి విషయంపై మీడియాతో మాట్లాడిన ఆమె.. అతని వ్యాఖ్యల్ని జగన్ (YS Jagan) తప్ప ఎవరూ సమర్థించడం లేదని, జగన్ వద్దే ప్రసన్నకుమార్ అలాంటి మాటలు నేర్చుకున్నాడని దుయ్యబట్టారు. ఒకపార్టీకి అధ్యక్షుడిగా ఉన్న జగన్.. కనీసం మానవత్వం ఉన్న మనిషిలా కూడా వ్యవహరించడం లేదని విమర్శించారు.

రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లెలి గురించే తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్రను జగన్ మూటగట్టుకున్నారన్నారు. రౌడీషీటర్లు, బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాల్ని ఆయన పరామర్శిస్తున్నారని, ఆయన పర్యటనల్లో ఒకసారి తలకాయ, మరోసారి మామిడికాయల్ని తొక్కించారని విమర్శలు గుప్పించారు. రప్పా రప్పా నరుకుతాం అనడం తప్పో కాదో ప్రజలు కూడా ఆలోచించాలని హోంమంత్రి అనిత హితవు పలికారు.

కాగా.. ప్రసన్నకుమార్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యేపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై ఒక మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అతనిపై బీఎన్ఎస్ 74, 75, 79, 296 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసినట్లు తెలిపారు. ఆయన వ్యాఖ్యలపై కోర్టు సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండి కూడా మహిళా ఎమ్మెల్యేపై ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏంటని మొట్టికాయలు వేసింది.

Next Story