క్రిమినల్స్ ఇలాంటివే చేస్తారు: వైసీపీ నేతలపై హోంమంత్రి ఫైర్

by srinivas |   ( Updated:2025-04-15 12:01:34.0  )
క్రిమినల్స్ ఇలాంటివే చేస్తారు: వైసీపీ నేతలపై హోంమంత్రి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: రాజకీయాల్లో క్రిమినల్స్ ఉంటే ఇలాంటివే జరుగుతాయని హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) అన్నారు. టీటీడీ గోశాల, వక్ఫ్ చట్టం, పాస్టర్ ప్రవీణ్ మృతి(Pastor Praveen passes away)పై జరిగిన దుష్ప్రచారంపై ఆమె మండిపడ్డారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై కొందరు కుట్రలు పన్ని ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మతకలహాలు తేవాలని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు చాలా కుముక్తులు పన్నుతున్నారని చెప్పారు. సిట్ విచారణ పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పు చేసిన వాళ్ల తప్పించుకోలేరన్నారు. కొందరు క్రిమినల్స్ చేసిన తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొడతామని చెప్పారు. మత ఘర్షణలకు వైసీపీ కుట్ర చేస్తోందన్నారు. పింక్ డైమండ్ అంటూ గతంలో దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. టీటీడీ చైర్మన్‌గా పని చేసిన వ్యక్తి జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. టీటీడీపై బురదజల్లి కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని ప్రయత్నం చేశారని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు.



Next Story

Most Viewed