Home minister Anitha: జగన్​వ్యాఖ్యలపై.. ఖాకీల గుస్సా!

by Thanuru Gopichand |   (  Updated:2025-04-09 06:18:32  IST  )

తాను అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు ఊడదీస్తానని హెచ్చరించిన వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలు ఏపీ పోలీసు వర్గాల ఆగ్రహానికి గురవుతున్నాయి

Home minister Anitha: జగన్​వ్యాఖ్యలపై.. ఖాకీల గుస్సా!
X

= ఊడదీయడానికి అవి అరటి తొక్కకాదు..

= రామగిరి ఎస్ఐ సుధాకర్​యాదవ్​కౌంటర్​

= పోలీసులంతా ఖండించాలని పిలుపునిచ్చిన పరిటాల సునీత

= స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత

= రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తే కేసులు పెడతాం

దిశ, డైనమిక్​ బ్యూరో : తాను అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు ఊడదీస్తానని హెచ్చరించిన వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలు ఏపీ పోలీసు వర్గాల ఆగ్రహానికి గురవుతున్నాయి. దీనిపై శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ తీవ్రంగా స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. జగన్ (YS Jagan) అధికారంలోకి వచ్చి ఊడదీస్తానంటే ఊడిపోవడానికి పోలీసు యూనిఫాం (Police Uniform) అరటితొక్క కాదన్నారు. పోలీసుల బట్టలు ఊడదీసి కొడతారా? అని ప్రశ్నించారు. మీరిస్తే పోలీసులు బట్టలు వేసుకోలేదని పేర్కొన్నారు. కష్టపడి చదివి, పరుగు పందెంలో పాసై, వేలమంది పాల్గొన్న పరీక్షలో నెగ్గి వేసుకున్న యూనిఫాం ఇదని చెప్పారు. తాము నిజాయతీగా ప్రజల పక్షాన నిలబడతామని, నిజాయతీగానే ఉద్యోగం చేస్తామని, నిజాయతీగానే చస్తామని, అంతే తప్ప అడ్డదారులు తొక్కబోమని స్పష్టం చేశారు. జాగ్రత్తగా మాట్లాడాలని, జాగ్రత్తగా ఉండాలని జగన్‌ను హెచ్చరించారు.

నిన్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత (Paritala Sunitha) మాట్లాడుతూ పోలీసులను ఇష్టానుసారంగా మాట్లాడటం ఏంటి అని ప్రశ్నించారు. పోలీసులపై దుర్మార్గంగా మాట్లాడటం సరికాదు అని హితవు పలికారు. జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు జిల్లా ఎస్పీ స్పందించాలన్నారు. ఆ వెంటనే ఎస్పీ స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ పర్యటనలో పోలీసులు ఎంతో సంయమనంతో వ్యవహరించిన నిష్పక్షపాతంగా విధులు నిర్వహించారని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న తెలిపారు.

ఇదే ఘటనపై ఈ రోజు హోమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉంటామన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా కేసులు పెడతామని హెచ్చరించారు. ఎక్కడా ఎవరినీ నిర్బంధించలేదని తెలిపారు. మాజీ సీఎంకు ఇవ్వాల్సిన భద్రత కంటే ఎక్కువ ఇస్తునానమని తెలిపారు. పోలీసుల బట్టలు ఊడదీస్తాననడం దారుణం అన్నారు. దానిపై స్పందించిన ఎస్​ఐ సుధాకర్​కు నిజంగా దమ్ముందన్నారు. ఎందుకు ఇలా మాట్లాడా అని జగన్​సిగ్గు పడాలన్నారు. ఖాకీ చొక్కా వంటిపైకి రావాలంటే ఎంతో కష్టపడారని తెలిపారు. అటువంటి ఖాకీ చొక్కా జగన్​ఊడదీస్తారా..? అని ప్రశ్నించారు. మహిళా పోలీసులను ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు. అక్కడికి వెళ్లి పోసాని, వంశీ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. జగన్​ హయాంలో 2,826 హత్యలు జరిగాయన్నారు. వాళ్లందరి దగ్గరికి వెళ్లి పరామర్శించే దమ్ముందా అని ప్రశ్నించారు. గతంలో 151 ఇక సీట్లు ఇస్తా మీ వ్యవహార శైలితో 11 స్థానాలకు దిగిపోయారని అన్నారు. పోలీసుల గురించి మాట్లాడేటపుడు ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. పోలీసు డిపార్ట్​మెంట్​మీద ఎవరైనా మాట్లాడితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని తెలపారు. పరిటాల హత్య కేసులో ఎవరు ఇన్​వాల్వ్​అయ్యారనే విషయం అందరికీ తెలుసునన్నారు. కోడి కత్తి, గులకరాయి వంటి నాటకాలు ఆడుతున్నారని తెలిపారు.


Next Story
null