TDP Mahanadu:‘ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే’.. హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-29 10:45:11  IST  )

కడప జిల్లాలో టీడీపీ మహానాడు మూడో రోజు(గురువారం) ఘనంగా జరుగుతుంది.

TDP Mahanadu:‘ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే’.. హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: కడప జిల్లాలో టీడీపీ మహానాడు మూడో రోజు(గురువారం) ఘనంగా జరుగుతుంది. నేటితో టీడీపీ మహానాడు ముగుస్తుండటంతో భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు, అభిమానులు తరలి వచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కడప గడ్డపై ప్రతి కార్యకర్తకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కడప గడ్డ తెలుగు దేశం పార్టీ అడ్డా అని సీఎం చంద్రబాబు నిరూపించారని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు టీడీపీ మహానాడు వేదికగా హోం మంత్రి అనిత ప్రసంగించారు.

రాబోయే 5 ఏళ్ల గురించి ఆలోచించే వారిని పొలిటికల్ లీడర్ అంటారు. 20 ఏళ్ల పాటు రాష్ట్రం అభివృద్ధి గురించి ఆలోచించేవాడిని విజనరీ లీడర్ అంటారు. ఆ విజనరీకి ఆరు అడుగుల నిలువెత్తు రూపమే సీఎం చంద్రబాబు అని ఆమె తెలిపారు. 75 ఏళ్ల వయసు 40 ఏళ్ల రాజకీయ అనుభవం చతురతతో 2047కి రాష్ట్రం ముందుండాలనే ఆశయంతో ఆయన కృషి చేస్తున్నారని హోం మంత్రి అనిత వెల్లడించారు.

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. ఉపాధి అవకాశాలు లేక యువత ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రౌడీ రాజకీయాలు చేస్తున్న సమయంలో.. ఒక బిడ్డ రోడ్డు పైకి వచ్చి.. తల్లిని అవమానించారు, తండ్రిని జైలుకు పంపించారు. అయిన అదరలేదు బెదరలేదని హోంమంత్రి అనిత గుర్తు చేశారు. ఈ తరుణంలో యువగళం పేరుతో నేను చేయగలనని 9 నెలల కాలంలో పార్టీకి పునరుత్తేజం తెచ్చి, కూటమిని అధికారంలోకి తీసుకు వచ్చిన నారా లోకేష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

టీడీపీ మహానాడుకు ముందు వర్షం పడింది. దీంతో మహానాడు జరగదని వైసీపీ వాళ్ళు డ్యాన్సులు వేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ.. సీఎం చంద్రబాబు సంకల్పం ముందు అవన్ని దిగదుడుపే అని ఆమె తేల్చి చెప్పారు. ప్రకృతి సహకరించి ఇప్పుడు ఇంత చల్లగా ఆశీర్వదించింది. ‘ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే’ అని ఆమె వైసీపీకి కౌంటర్ ఇచ్చారు. గత ఐదేళ్లు అనేక కేసులు పెట్టారని హోం మంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం చంద్రబాబు రాయలసీమలో ఫ్యాక్షన్ ను ప్రారదోలి కత్తిపట్టిన చేతికే ఉపాధి చూపించారని తెలిపారు.

రాయలసీమలో ప్రతి ఇంట్లో సీఎం చంద్రబాబు ఫొటో పెట్టుకోవాలి.. ఎందుకంటే నేడు రాయలసీమకు కియా, శ్రీ సిటీ, హీరో వంటి కంపెనీలు తెచ్చారు. నిన్న మహానాడులో లోకేష్ చేసిన 6 శాసనాలు 2047 కి ప్రధాన భూమిక పోషించబోతున్నాయి. ఇవే పునాదులు కాబోతున్నాయి. ఆరు శాసనాలను గ్రామ గ్రామాన వెళ్లి చెప్పే బాధ్యత మేం తీసుకుంటాం. 2047 విధానాలపై పని చేయండి. మళ్లీ ఐదేళ్ల తర్వాత నేను వస్తానని కలలు కనేవారికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అని ఆమె తెలిపారు. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే పని చేయాలని కోరుకుంటున్నానని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.

‘వై నాట్ 175’ అన్న జగన్.. అడ్రస్ లేకుండాపోయాడు... మంత్రి నారాయణ హాట్ సెటైర్లు


Next Story