వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్.. హోంమంత్రి అనిత ఏమన్నారంటే?

by Jakkula.Mamatha |

ఏపీ(Andhra Pradesh)లో లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్.. హోంమంత్రి అనిత ఏమన్నారంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇటీవల వైసీపీ ఎంపీ(YCP MP) మిథున్ రెడ్డి(Mithun Reddy)ని మద్యం కుంభకోణం కేసులో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ తరుణంలో మిథున్ రెడ్డి అరెస్ట్ పై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు.

ఇవాళ(సోమవారం) శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హోంమంత్రి అనిత(Home Minister Anitha) పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ఆధారాలు ఉంటేనే పోలీసులు అరెస్ట్ చేస్తారని అన్నారు. ఏ ఆధారాలు లేకుండా ఎవరినీ అరెస్టు చేయరు అని ఆమె తెలిపారు. కోర్టు రిమాండ్ విధించిందంటే మనం గౌరవించాలి. ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని హోం మంత్రి అనిత తేల్చి చెప్పారు. కోర్టుకు సరైన ఆధారాలు ఇవ్వకుంటే రిమాండ్ కు ఇవ్వరు కదా అని పేర్కొన్నారు. ప్రొసీజర్ యథావిధిగా సాగుతుందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

Next Story