భూమన అనుచరుల ఆగడాల పై స్పందించిన హోంమంత్రి.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్

by Jakkula.Mamatha |   (  Updated:2025-08-07 06:47:26  IST  )

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై హోం మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

భూమన అనుచరుల ఆగడాల పై స్పందించిన హోంమంత్రి.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ,వెబ్‌డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) పై హోం మంత్రి అనిత(Home Minister Anitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ(Andhra Pradesh)లోని తిరుపతి జిల్లాలో వైసీపీ సోషల్ మీడియా(Social Media) ఇంచార్జి అనిల్ రెడ్డి దౌర్జన్యం అంటూ సామాజిక మాధ్యమంలో ఒక వీడియో వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. శ్రీనివాస వసతి గృహం ఎదురుగా ఉన్న షాప్ కాంటాక్ట్ తనకు రాసివ్వాలని ఓ గిరిజన యువకుడిపై దారుణంగా దాడి చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్(Video Viral) కావడంతో.. నిందితుడు అనిల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అమానవీయ ఘటన పై తాజాగా హోంమంత్రి అనిత స్పందిచారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. మాజీ మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుల ఆగడాల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంతటి వారైనా చట్టం ముందు సమానులే అన్నారు. ఘటనకు పాల్పడిన వారిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ నేతల ఆగడాలు ఎక్కువవుతున్నాయని, అమాయక ప్రజల పై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిత హెచ్చరించారు.

Next Story