షకీల్, త్రిష పాత్ర మరువలేనిది: హోంమంత్రి వంగలపూడి అనిత

by Vemula.Srinu Prasad |

అండర్ -19 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ సాధించి రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున హోంమంత్రి వంగలపూడి అనిత అభినందనలు తెలిపారు

షకీల్, త్రిష పాత్ర మరువలేనిది: హోంమంత్రి వంగలపూడి అనిత
X

దిశ, వెబ్ డెస్క్: అండర్ -19 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ సాధించి రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anita) అభినందనలు తెలిపారు. మేటి జట్లను మట్టి కరిపించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన అద్భుతమైన సందర్భంలో మన తెలుగు తేజాలు విశాఖకు చెందిన షబ్నమ్ షకీల్(Shabnam Shakeel), తెలంగాణకు చెందిన గొంగడి త్రిష(Gongadi Trisha) పాత్ర మరువలేనిదని ఆమె తెలిపారు. కౌలాలంపూర్ వేదికగా సౌతాఫ్రికా(South Africa)తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తెలుగు బిడ్డ గొంగడి త్రిష 3 వికెట్లు తీయడంతోపాటు అజేయంగా 44 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించగా.. బౌలింగ్‌లో ఒక వికెట్ తీసిన షబ్నమ్ తన వంతు పాత్ర పోషించడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. మీరు సాధించిన విజయం మరెంతోమందికి ప్రేరణ అవుతుందని ఆశిస్తున్నానని అనిత ట్వీట్ చేశారు.

కాగా మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌(Womens Under-19 T20 World Cup) విజేతగా భారత్ నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించింది. 83 పరుగుల టార్గెట్‌ను 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. కేవలం 11.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తెలంగాణ రాష్ట్రం భద్రాచలానికి చెందిన గొంగిడి త్రిష రాణించింది. బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటారు. బ్యాటింగ్‌లోనూ అదరగొట్టారు. జట్టు విజయంలో త్రిష కీలక పాత్ర పోషించారు. ఫైనల్‌లో మరో బ్యాటర్ సానిక చల్కే కూడా రాణించారు.

Next Story