నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ అవార్డు: గర్వంగా ఉందంటూ హోంమంత్రి ట్వీట్

by Vemula.Srinu Prasad |

నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ అవార్డు రావడం గర్వంగా ఉందంటూ హోంమంత్రి అనిత ట్వీట్ చేశారు..

నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ అవార్డు: గర్వంగా  ఉందంటూ హోంమంత్రి ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari)కి ప్రతిష్టాత్మక డిస్టింగ్విష్డ్ అవార్డు(Distinguished Award) లభించింది. సామాజిక సేవలో సామాన్యులకు విశేష సేవలందినందుకు ఆమెకు ఈ ఘనత దక్కింది. దీంతో భుశనేశ్వరికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. హోంమంత్రి అనిత సైతం భువనేశ్వరికి విషెస్ తెలిపారు. సామాజిక సేవలో సామాన్యులకు విశేష సేవలందిస్తూ సమున్నత శిఖరాలకు చేరుతున్న నారా భువనేశ్వరి అమ్మకు అభినందనలు అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) 2025 సంవత్సరానికి అందించే డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డుకు భువనేశ్వరి ఎంపిక కావడం ఎంతో సంతోషమన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తలసేయమియా బాధితుల సంక్షేమం కోసం కృషి చేస్తూనే, మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సామాజిక సాధికారతకు పాటుపడుతున్న వ్యక్తిగా ఇంతటి అత్యున్నత గౌరవం దక్కడం తెలుగు మహిళలుగా తమ అందరికీ గర్వకారణంగా ఉందన్నారు. తమ స్ఫూర్తితో మరెంతోమంది సమాజసేవ వైపు అడుగులేస్తూ సమ సమాజ స్థాపనకు కృషి చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో తమరు మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నానంటూ హోం మంత్రి వంగలపూడి అనిత ట్వీట్ చేశారు. Tweet

Next Story