దివ్యాంగుడికి అండగా హోంమంత్రి అనిత

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-17 04:39:24  IST  )

కష్టం చెప్పుకుంటే క్షణం ఆలోచించకుండా సాయం అందించే ఏపీ(Andhra Pradesh) హోంమంత్రి అనిత మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు

దివ్యాంగుడికి అండగా హోంమంత్రి అనిత
X

దిశ,వెబ్‌డెస్క్: కష్టం చెప్పుకుంటే క్షణం ఆలోచించకుండా సాయం అందించే ఏపీ(Andhra Pradesh) హోంమంత్రి అనిత మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహిస్తుండగా దివ్యాంగుడు సుంకర ఆనంద్ సాయం కోరి వచ్చాడు. ఆనంద్ చిన్నతనం నుంచి కాళ్లు లేకపోయినా స్వయంకృషితో సైకిల్ రిపేర్లు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆనంద్‌ను ఆప్యాయంగా పలకరించిన అనిత(Home Minister Anitha).. అతని కష్టాలు తెలుసుకొని తీర్చేందుకు సిద్ధమయ్యారు. ట్రై మోటార్ సైకిల్ అందజేస్తానని హామీ ఇచ్చారు. అడిగిన వెంటనే తన కష్టం తీరుస్తానని హామీ ఇచ్చిన హోం మంత్రి అనితకు ఆనంద్ కృతజ్ఞతలు తెలిపారు.

Next Story