- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాస్టర్ మృతి పై హోంమంత్రి అనిత స్పందన.. విచారణకు ఆదేశం
పాస్టర్ ప్రవీణ్ పగడాల హఠాన్మరణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది.

దిశ,వెబ్‌డెస్క్: పాస్టర్ ప్రవీణ్ పగడాల హఠాన్మరణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. చాగల్లులో జరిగే క్రైస్తవ సభకు హాజరయ్యేందుకు నిన్న(మంగళవారం) ద్విచక్ర వాహనంపై రాజమండ్రి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. అయితే పాస్టర్ మృతి పై క్రైస్తవ సంఘాలు, పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) కూడా ఈ ఘటనపై స్పందించారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ(Andhra Pradesh) హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Anitha) పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై స్పందించారు. ఈ క్రమంలో ఆమె పాస్టర్ మరణం పై సమగ్ర విచారణకు ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. పాస్టర్ ప్రవీణ్ ప్రమాదం జరిగిన సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించాలని అధికారులకు హోంమంత్రి అనిత సూచించారు. క్రైస్తవ సంఘాలు కోరిన మేరకు పోస్టుమార్టం వీడియో రికార్డింగ్ చేసినట్లు తెలిపిన ఎస్పీ తెలిపారు.






