- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీలైనంత త్వరగా అదుపు చేయండి: రాంబిల్లి ఘటనపై హోంమంత్రి అనిత ఆదేశం
అనకాపల్లి జిల్లా రాంబిల్లి సెజ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత స్పందించారు..

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalli) రాంబిల్లి(Rambilli) సెజ్(Sez)లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్వీఎస్ ఫార్మా(SVS Pharma)లో ఒక్కసారిగా మంటలు భారీగా చెలరేగాయి. అంతేకాదు పొగలు చుట్టూ కమ్ముకున్నాయి. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. పొగలోనే కార్మికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలంలో మంటలను అదుపు చేస్తోంది. విషయం తెలుసుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) స్పందించారు. వీలైనంత త్వరగా మంటలను అదుపులోకి తీసుకురావాలని అధికారులను ఆమె ఆదేశించారు.
ఇంకా చెలరేగుతూనే మంటలు
అయితే మంటలు ఇంకా చెలరేగుతున్నట్లు తెలుస్తోంది. ‘‘అగ్నిప్రమాదం ఎలా జరిగింది...?. మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా..?. నష్టం ఎంత జరిగి ఉంటుంది.?.’’ అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం మంటలు కొనసాగుతున్నాయి. దీంతో మంటలార్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తోంది.






