రికార్డులు కొత్త కాదు… పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర: హోంమంత్రి అనిత

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-27 09:26:31  IST  )

రికార్డులు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదని, ఆ పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర అని, ఒక సంచలనమని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు...

రికార్డులు కొత్త కాదు… పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర: హోంమంత్రి అనిత
X

దిశ, వెబ్ డెస్క్: రికార్డులు తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)కి కొత్త కాదని, ఆ పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర అని, ఒక సంచలనమని హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anita) వ్యాఖ్యానించారు. ఇప్పుడు హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడు–2026 ద్వారా గ్రామ గ్రామానికీ, ప్రతి కార్యకర్త హృదయానికీ మహానాడు చేరుతోందని ఆమె పేర్కొన్నారు. మంగళగారి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు - 2026లో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వంగలపూడి అనిత(Vangalapudi Anita) మాట్లాడుతూ మహానేత ఎన్టీఆర్(Ntr) గారికి పూలమాలలు అర్పించి నివాళులర్పించామని చెప్పారు. ‘స్త్రీశక్తి’ థీమ్‌తో జరగనున్న ఈ మహానాడు మహిళల ఆత్మగౌరవం, సాధికారత, భద్రత కోసం తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ‘స్త్రీ శక్తి’నే సమాజ ప్రగతికి మూలం అన్న విశ్వాసంతో మహానాడు–2026 మహిళా శక్తికి మరింత ప్రేరణగా నిలవాలని అనిత ఆకాంక్షించారు. మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా నిలిచిందని మహిళలకు సమాన హక్కులు, రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే సంకల్పంతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు టిడిపి బలమైన మద్దతు తెలిపిందని హోంమంత్రి అనిత హర్షం వ్యక్తం చేశారు. ‘‘జై జగన్ అని అనమంటే జై చంద్రబాబు .. జై తెలుగుదేశం అన్నాడని, టీడీపీ బీసీ కార్యకర్త తోట చంద్రయ్యను నడిరోడ్డుపై గొంతుకోసి చంపారు గొడ్డలి పార్టీ రౌడీలు. చంద్రయ్య కుటుంబానికి జగన్ అన్యాయం చేస్తే చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేసింది. సరిగ్గా మహానాడు పండుగ వేళ చంద్రయ్య కొడుకు వీరాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగి అయ్యాడు.’’ అని హోంమంత్రి అనిత తెలిపారు.

Next Story