ఓ మనిషి చనిపోతే సమర్థించుకుంటారా?: హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం

by Vemula.Srinu Prasad |

జగన్ కారు ఢీకొని వ్యక్తి చనిపోతే సమర్థించుకుంటారా అని హోంమంత్రి అనిత ప్రశ్నించారు..

ఓ మనిషి చనిపోతే సమర్థించుకుంటారా?: హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన(Ys Jagan Rentapalla visit)లో ఆయన కారు (CAr)ఢీకొని సింగయ్య(Singaiah) అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. తొలుత ఆయన కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని వ్యక్తి చనిపోయారని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో జగన్ కారు ఢీకొని సింగయ్య మృతి చెందారని తేలింది. అయితే ఇప్పుడు ఈ ఘటన రాజకీయ రచ్చకు దారి తీసింది. జగన్ కారు ఢీకొన్నప్పుడు రికార్డు అయిన వీడియో ఫేక్ అని, ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ చేశారని వైసీపీ నేతలు అంటున్నారు. దీంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. సింగయ్య మృతి, వైసీపీ నేతల కామెంట్స్‌పై తాజాగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) స్పందించారు.

‘‘జగన్ రెంటపాళ్ల పర్యటనకు వంద మందికే అనుమతించాం. భారీ సంఖ్యలో కార్యకర్తలను తరలించారు. కారు కింద వ్యక్తి పడినా పట్టించుకోలేదు. ర్యాలీ కొనసాగించారు. వ్యక్తిని టైమ్‌కు ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే బతికేవారేమో. జాలి, దయ లేకుండా వ్యవహరించారు. రాజకీయలబ్ధి తప్ప.. జగన్‌కు ప్రజల ప్రాణాలు జగన్‌కు పట్టవా..?. కారు కింద పడి సింగయ్య నలిగిపోయినట్టు వీడియోలో స్పష్టంగా ఉంది. అయినా ఏఐ అంటూ వైసీపీ వాళ్లు మాట్లాడుతున్నారు. పరామర్శ పేరుతో బలప్రదర్శన చేస్తారా..?. ఓ వ్యక్తి చనిపోతే సానుభూతి చూపించకుండా సమర్థించుకుంటున్నారు.’’ అని హోంమంత్రి అనిత మండిపడ్డారు.

Next Story