- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: హోంమంత్రి అనితకు అస్వస్థత.. ప్రైవేటు ఆస్పత్రికి తరలింపు
హోంమంత్రి వంగలపూడి అనిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈరోజు శాసనసభతో పాటు మండలికి కూడా ఆమె హాజరయ్యారు....

దిశ, వెబ్ డెస్క్: హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈరోజు శాసనసభతో పాటు మండలికి కూడా ఆమె హాజరయ్యారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై చర్చలోనూ అనిత పాల్గొన్నారు. మండలి వాయిదా పడింది. ప్రస్తుతం శానససభ కొనసాగుతోంది. ఈ సమయంలోనే హోంమంత్రి అనిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే సిబ్బంది.. స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాలు, వరుస కార్యక్రమాలతో ఆమె బీజీగా ఉన్నారు. ఒక వారం నుంచి అసలు విశ్రాంతి లేకుండా ఆమె ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హోంమంత్రి అనిత అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ప్రస్తుతం హోంమంత్రి పరిస్థితిపై ఆందోళన అవసరం లేదని, ఈ రోజు సాయంత్రం వరకు డిశ్చార్జి అవుతారని ఆమె వ్యక్తిగత సిబ్బంది చెప్పినట్లు తెలుస్తోంది.






