హోంమంత్రి అనిత ఆగ్రహం.. వారిపై కఠిన చర్యలకు ఆదేశం

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-17 08:00:22  IST  )

రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది.

హోంమంత్రి అనిత ఆగ్రహం.. వారిపై కఠిన చర్యలకు ఆదేశం
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. సీఎం చంద్రబాబు(CM Chandrababu) సొంత నియోజకవర్గమైన కుప్పంలో పట్టపగలు జరిగిన ఓ అమానుష ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అప్పు తీర్చ లేదని ఓ మహిళను అత్యంత దారుణంగా చెట్టుకు కట్టేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో ఈ వీడియోలపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Anitha) తీవ్రంగా స్పందించారు.

ఈ తరుణంలో బాధితురాలు శిరిషతో వీడియో కాల్‌లో మాట్లాడుతూ.. ఆమెకు ధైర్యం చెప్పారు. ఈ క్రమంలో పూర్తి న్యాయం చేస్తామని బాధితురాలికి హోం మంత్రి అనిత హామీ ఇచ్చారు. మహిళ అప్పు తీర్చలేదని ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె తెలిపారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను ఆదేశించారు. అలాగే, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందిస్తూ.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఏపీ(Andhra Pradesh)లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం హెచ్చరించారు.

Next Story