- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇదే నా జగన్ చెప్పే విశ్వసనీయత..మార్ఫింగ్ వీడియోపై హోం మంత్రి అనిత ఫైర్
జగన్ పరామర్శలకు వెళ్తున్నారంటే తామెప్పుడూ అభ్యంతరం చెప్పలేదని హోమంత్రి అనిత అన్నారు. జగన్ పర్యటనలపై వైసీపీ

దిశ, వెబ్ డెస్క్: జగన్ పరామర్శలకు వెళ్తున్నారంటే తామెప్పుడూ అభ్యంతరం చెప్పలేదని హోమంత్రి అనిత అన్నారు. జగన్ పర్యటనలపై వైసీపీ సరైన సమాచారం ఇవ్వట్లేదని, సరైన సమాచారం ఇస్తే.. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. జగన్ నెల్లూరు పర్యటనలో బంగారుపాళ్యం వీడియోలు పెట్టి మార్ఫింగ్ చేశారంటూ ఎద్దేవా చేశారు. జనాలు లేకపోవడంతో ప్రజలను మభ్యపెట్టడానికి అవాస్తవాలను వాస్తవంగా చిత్రీకరించడానికి లేనిది ఉన్నట్టు చూపించడానికి మీ ఛానల్ ఇంత దిగజారుతుందా అని వైఎస్ భారతిని ప్రశ్నించారు.
కాయిన్‌కు మరో వైపు చూపిస్తామని చెప్పుకుంటున్న మీరు దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చిత్రీకరిస్తున్నారని అన్నారు. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి బయటకు వచ్చి పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లిక్కర్ కేసుపై దర్యాప్తు జరుగుతుందని నిందితుడు ఎవరో కోర్టులు తేలుస్తాయన్నారు. బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ ఎవరో తెలియదని, చట్టం తనపని తానుచేసుకుంటూ వెళుతుందన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి జగన్ ఇంటికి వెళ్లి పరామర్శించాడంటే ఆయన కామెంట్లను సమర్దిస్తున్నాడా అని ప్రశ్నించారు. చెల్లెలి వరుసయ్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్నకుమార్ నీచాతినీచంగా మాట్లాడితే జగన్ కనీసం జాలి కూడా చూపించలేదన్నారు.






