- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గన్నవరం విమానాశ్రయానికి హోంమంత్రి అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఖమ్మంలో బీజేపీ బహిరంగ సభలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి నేరుగా ఆయన గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి తానేటి వనిత, అధికారులు, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత అమిత్ షా విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మంకు బయలుదేరి వెళ్లారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ బీజేపీ అధిష్టానం చెప్పుకొస్తోంది. ఇందులో భాగంగా ఖమ్మం గడ్డ నుంచి శాసనసభ ఎన్నికలకు సమరశంఖం పూరించేందుకు బీజేపీ సన్నద్ధమవుతుంది. ఈ క్రమంలో ఖమ్మంలో ‘రైతు గోస- బీజేపీ భరోసా’పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే.






