ఈ సమయంలో విమర్శలు సరికాదు: జగన్‌కు హోంమంత్రి సూచన

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-10 13:31:47  IST  )

స్టీల్‌ప్లాంట్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మృతుల కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించామని రాష్ట్ర హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం కలిపి మృతుల కుటుంబాలకు రూ.కోటి కంటే ఎక్కువే పరిహారం అందిస్తున్నామని, చనిపోయిన ఒప్పంద కార్మికుల కుటుంబాలకు పరిహారంతో పాటు ఉద్యోగం కూడా ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు..

ఈ సమయంలో విమర్శలు సరికాదు: జగన్‌కు హోంమంత్రి సూచన
X

దిశ, వెబ్ డెస్క్: స్టీల్‌ప్లాంట్‌(Steel Plant) చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మృతుల కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించామని రాష్ట్ర హోంమంత్రి అనిత(Home Minister Anita) స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం కలిపి మృతుల కుటుంబాలకు రూ.కోటి కంటే ఎక్కువే పరిహారం అందిస్తున్నామని, చనిపోయిన ఒప్పంద కార్మికుల కుటుంబాలకు పరిహారంతో పాటు ఉద్యోగం కూడా ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కేంద్రమంత్రి కుమారస్వామితో మాట్లాడి తగిన చర్యలు తీసుకున్నారని, ఇలాంటి ఘోర ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయ విమర్శలు చేయడం సరికాదని హోంమంత్రి అనిత హితవు పలికారు.

జగన్‌పై అనిత ఫైర్

ఇదే సమయంలో వైఎస్ జగన్‌(Ys Jagan)పై హోం మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్‌ అనే పదం పలికేందుకు కూడా జగన్‌కు అర్హత లేదని, సీఎం హోదాలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైనా స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించారా లేదా కార్మికుల సమస్యలపై మాట్లాడారా అని నిలదీశారు. ప్రైవేటీకరణ విషయంలో జగన్ వైఖరి ఎలాంటిదో మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అప్పట్లోనే స్పష్టం చేశారని గుర్తుచేశారు. జగన్‌ ఆస్పత్రికి వచ్చినప్పుడు కార్యకర్తలు కేకలు వేయడంపై మండిపడుతూ, స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై జగన్ గత మాటలను అందరూ ఒక్కసారి గుర్తుచేసుకోవాలని పునరుద్ఘాటించారు.

Next Story