చారిత్రాత్మక ఘట్టం.. రాజయ్యపేటలో స్టీల్‌ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు ఘనంగా శంకుస్థాపన

by Ramesh Naini |

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.

చారిత్రాత్మక ఘట్టం.. రాజయ్యపేటలో స్టీల్‌ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు ఘనంగా శంకుస్థాపన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో సుమారు రూ. 1.36 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఆర్సెలార్‌ మిట్టల్, నిప్పాన్‌ స్టీల్‌ ఇండియా (AMNS) సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. దేశంలోనే భారీ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌గా ఇది నిర్మితమవుతోంది. దీని ద్వారా ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి జరగనుంది. మొత్తం 5,465 ఎకరాల్లో రెండు దశల్లో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇందుకోసం తొలి దశ కింద ఇప్పటికే 2164 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.

హాజరైన ప్రముఖులు..

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కుమారస్వామి, భూపతి రాజు శ్రీనివాస వర్మ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రాజయ్యపేట చేరుకున్న సీఎం చంద్రబాబుకు, కేంద్ర మంత్రులకు లక్ష్మీ మిట్టల్, సంస్థ సీఈవో ఆదిత్య మిట్టల్ ఘన స్వాగతం పలికారు. మంత్రి లోకేశ్ ఆర్సెలార్ ప్రతినిధులను సీఎంకు పరిచయం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి కుమారస్వామి తదితరులు అక్కడి ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను సందర్శించి స్టీల్‌ప్లాంట్ నమూనాను (మోడల్) పరిశీలించారు.

Next Story