AP Deputy CM: ‘ఆయన మరణం చాలా బాధాకరం’.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్

by Jakkula.Mamatha |

బాలీవుడ్‌ ఇండస్ట్రీ(Bollywood industry)లో తీవ్ర విషాదం నెలకొంది.

AP Deputy CM: ‘ఆయన మరణం చాలా బాధాకరం’.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్
X

దిశ,వెబ్‌డెస్క్: బాలీవుడ్‌ ఇండస్ట్రీ(Bollywood industry)లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రసిద్ధ దర్శకుడు, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత మనోజ్‌ కుమార్(87) ఇవాళ(శుక్రవారం) మృతి చెందిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్‌ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే ఆయన మరణవార్త తెలుసుకున్న బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఈ తరుణంలో బాలీవుడ్‌ నటుడు మనోజ్‌కుమార్‌(Manoj Kumar) మరణం పై ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కళ్యాణ్(Deputy CM pawan Kalyan) స్పందించారు. ఆయన మరణం చాలా బాధాకరం అన్నారు. చిత్రపరిశ్రమలో మనోజ్‌కుమార్‌ది ప్రత్యేక స్థానం అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ క్రమంలో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. అయితే.. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన అందించిన అమూల్యమైన సేవలకు గుర్తింపుగా.. కేంద్ర ప్రభుత్వం 2015లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును అందించింది.

Next Story